Lyrics: ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలోవరి - Uppongele Godavari Song Lyrics in Telugu
Uppongele Godavari Song Lyrics in Telugu
షడ్యమాం భవతి వేదం.. పంచమాం భవతి నాదం.. శృతి శిఖరే.. నిగమజనే.. స్వరలహరీ..
సాస పాపపప పమరిస సనిస సాస పాపపప పమదప ప సాస పాపపప పమరిస సనిస సాస పాపపప పమదప ప
పల్లవి: ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ.. మా సీమకే చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరీ.. వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారీ.. రామ చరితకే పూదారి వేసై చాప తోసై నావ బార్సై వాలుగా.. చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా..
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ.. మా సీమకే చీనాంబరీ
చరణం 1: సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానె లాభసాటి బేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ.. నది ఊరేగింపులో.. పడవమీద రాగా.. ప్రభువు తాను కాగా..
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ.. మా సీమకే చీనాంబరి
చరణం 2: గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకీ సందేహాల మబ్బే పట్టె చూసే కంటికీ లోకం కాని లోకం లోన ఏకాంతాల వలపు.. అల పాపికొండలా.. నలుపు కడగలేకా.. నవ్వు తనకు రాగా..
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ.. మా సీమకే చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరీ.. వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారీ.. రామ చరితకే పూదారి వేసై చాప తోసై నావ బార్సై వాలుగా.. చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా..
ఉప్పొంగెలే గోదావరీ.. ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరీ.. మా సీమకే చీనాంబరీ
చిత్రం : గోదావరి రచన : వేటూరి సంగీతం : K. M. రాధా కృష్ణన్ గానం : S.P. బాలు (SP బాల సుబ్రహ్మణ్యం)
వీక్షించండి: