Lyrics: రామ చక్కని సీతకి.. అరచేత గోరింట - Rama chakkani seetha ki song lyrics in telugu

Lyrics - Rama sakkani seethaki
Rama Chakkani Song Lyrics in Telugu - Godavari

నీల గగన.. ఘనవిచలన.. ధరణిజ శ్రీ రమణ ఆ.. ఆ.. ఆ.. మధుర వదన.. నళిన నయన.. మనవి వినరా రామా ఆ.. ఆ.. ఆ..

పల్లవి: రామ చక్కని సీతకి.. అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకీ.. ఇంకెవరూ మొగుడంట రామ చక్కని సీతకీ..

చరణం 1: ఉడత వీపున వేలు విడిచిన.. పుడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును.. ఎత్తిన ఆ రాముడే ఎత్తగలడా సీత జడనూ.. తాళి కట్టే వేళలో రామ చక్కని సీతకీ..

చరణం 2: ఎర్రజాబిలి చేయిగిల్లి.. రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే.. చెప్పలేమని కనులు చెప్పే నల్లపూసైనాడు దేవుడు.. నల్లనీ రఘురాముడూ రామ చక్కని సీతకీ..

చరణం 3: చుక్కనడిగా దిక్కునడిగా.. చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన.. నీటి తెరలే అడ్డునిలిచే చూసుకోమని మనసు తెలిపే.. మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకీ..

ఇందువదనా.. కుందరాదనా.. మందగమనా.. భామా.. ఎందువలనా.. ఇందువదనా.. ఇంత మదనా.. ప్రేమా!!

చిత్రం: గోదావరి (Movie: Godavari) సంగీతం : K. M. రాధా కృష్ణన్ (Music: K. M. Radha Krishnan) సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి (Lyrics: Veturi SundaraRama Murthi) గానం: గాయత్రీ ఆశోకన్ (Singer: Gayathri Ashokan)

వీక్షించండి: