ధ్యానం/Meditation ఎందుకు చేయాలి? ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?


ధ్యానం | Meditation

ఉదయం లేచినప్పటి నుంచి మళ్లీ నిద్రపోయేంత వరకు ఏదో ఒక విషయాన్ని మాట్లాడుతూ, ఆలోచిస్తూ ఉంటాం కదా కాసేపు అసలేమీ ఆలోచించకుండా మాట్లాడకుండా మౌనంగా ఉండడం అంటే కాస్త కష్టమే కదా.. అసలు ఊహించుకోలేము కూడా.. కానీ ఇదంతా అసాధ్యమేమీ కాదు.

శరీరానికి కావాల్సిన ఆరోగ్యం మెదడుకు కావాల్సిన ప్రశాంతతను చేకూర్చేది "మౌనం", ఇది ఎప్పుడో రుజువైంది. మౌనం మంచిదేనా కాదా అని తెలుసుకోవాలంటే మనం కూడా ఒకసారి పాటించి చూడాల్సిందే!

"ధ్యానం" అనేది మానసిక, శారీరక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం చేసే ఆధ్యాత్మిక సాధన. ధ్యానం అనేది మనం 'చేసేది' కాదు మనం 'అనుభూతి' చెందే పరిమళం అని చెప్పవచ్చు.

మన ఉపనిషత్తులు మహాభారతం, భగవద్గీతల్లో ధ్యానం గురించి చెప్పారు. మంచి ప్రవర్తనను కలిగి ఉండడం కూడా ధ్యానంలో భాగమే! ధ్యానం చేయడం వల్ల కోపం, ఈర్ష, ఒత్తిడి లాంటి చెడు గుణాలు తగ్గుతాయి. గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. రోజంతా ఉత్సాహంగా గడపొచ్చు. ధ్యానంతో సృజనాత్మకత మరియు సహనం పెరుగుతుంది. జ్ఞానం శరీరంలోని ప్రాణ శక్తులను సమన్వయం చేస్తుంది. హానికరమైన ఒత్తిడిని తొలగించి, ఆరోగ్యం మరియు శక్తిని పెంపొందిస్తుంది. ధ్యానం చేయడం ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతో తోడ్పడుతుంది. అధిక ఒత్తిడికి గురైనప్పుడు మెదడు, శరీరంలోని ఇతర భాగాలకు పంపే సంకేతాలు సరిగా ఉండవు ధ్యానం వల్ల మెదడులోని హైపోదలమస్ పనులు కొంత నెమ్మదించి విశ్రాంతి దశకు చేరుతుంది. అందువల్ల ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం దొరుకుతుంది.


ధ్యానం వల్ల ఎక్కువ సమయం ఒకే అంశం పట్ల మనసును కేంద్రీకరించడం అలవడుతుంది.

మన మనసు ఆందోళన నుండి విముక్తి పొందేలా ప్రశాంతత మరియు శాంతి ధ్యానం వల్ల కలుగుతుంది. ధ్యానం వల్ల వచ్చే ఆనందం ద్వారా మనం ఆనందకరమైన, స్వచ్ఛమైన స్థితిని అనుభవించగలుగుతాము.

ప్రశాంతతతో కూడిన మనస్సు, మంచి ఏకాగ్రత, అవగాహన, స్పష్టత, సమాచార అభివృద్ధి, మానసిక నైపుణ్యాలు ధ్యానం వల్ల వృద్ధి చెందుతాయి.

మానవులు ప్రతిభ ధ్యానం ద్వారా వికసించడం జరుగుతుంది.

ధ్యానం, బుద్ధి కుశలత, ఏకాగ్రతల పై చేసిన ఓ సర్వేలో తెలిసిందేంటంటే క్రమంగా ధ్యానం చేసే వారిలో ఈ యొక్క ధ్యానం వల్ల ఒత్తిడిని సక్రమంగా అధిగమించడం, మంచి నిద్రా సమయం ఏర్పడటం లక్షణాలు ధ్యాన సాధకుల్లో గమనించినట్లు ఈ సర్వే ఫలితాల ద్వారా వెళ్లడయింది.

ధ్యానం మనకు ప్రస్తుత క్షణాన్ని జీవించడం నేర్పుతుంది.

ధ్యానం చేయడం వలన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.