పోలీసు స్టేషన్లో వీడియో తీయవచ్చు - బాంబే హైకోర్టు తీర్పు


పోలీసు స్టేషన్లో వీడియోలు తీసుకోవచ్చని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ స్పష్టం చేసింది.

పోలీసు స్టేషన్లో వీడియో తీయవచ్చు. అదేమీ నిషిద్ధ ప్రాంతం కాదు.. బాంబే హైకోర్టు తీర్పు.

పోలీసు స్టేషన్లో వీడియోలు తీసుకోవచ్చని బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ స్పష్టం చేసింది.

అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిషిద్ధ ప్రాంతాల జాబితాలో పోలీసు స్టేషన్ లేదని తెలిపింది.

అందువల్ల అక్కడ వీడియోలు తీయడం నేరం కాదని పేర్కొంది.

ఈ మేరకు మనీష్ పిటాలే, జస్టిస్ వాల్మీకి మెనెజెస్ల ధర్మాసనం తీర్పు చెప్పింది.

మహారాష్ట్రలోని వార్తాకు చెందిన రవీంద్ర ఉపాధ్యాయకు, పొరుగింటివారికి గొడవ జరిగింది. ఇరు పక్షాలు పోలీసు స్టేషన్లో కేసులు పెట్టుకున్నాయి.

పోలీసు స్టేషన్లో చర్చలు జరుగుతుండగా దాన్ని ఉపాధ్యాయ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. దాంతో అధికారిక రహస్యాల చట్టం కింద ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గూఢచర్యానికి పాల్పడకుండా నిషేధించాలన్న ఉద్దేశంతో కొన్ని కార్యాలయాలను నిషిద్ధ ప్రాంతాలుగా ఈ చట్టం గుర్తించింది.

అక్కడ ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేధించింది.

ఆ చట్టంలోని సెక్షన్ 2 (8), సెక్షన్ 3లలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

ఆ జాబితాలో పోలీసు స్టేషన్ లేనందున అక్కడ వీడియోలు తీయడం తప్పేమీ కాదని ధర్మాసనం తెలిపింది.