విరూపాక్ష తెలుగు మూవీ రివ్యూ
విరూపాక్ష తెలుగు మూవీ రివ్యూ
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్, సాయి చంద్, సునీల్, బ్రహ్మాజీ, అజయ్, రాజీవ్ కనకాల, రవి కృష్ణ, సోనియా సింగ్ తదితరులు... ఛాయాగ్రహణం : ష్యామ్ దత్ సైనుద్దీన్ సంగీతం : బి. అజనీష్ లోక్ నాథ్ నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ కథ, దర్శకత్వం : కార్తీక్ దండు స్క్రీన్ ప్లే : సుకుమార్ నిర్మాత : బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022
బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సాయిధరమ్ తేజ్ సినిమాలు చేస్తాడో లేదోననే చర్చ కూడా జరిగింది.అన్ని పరిస్థితులను దాటి సాయిధరమ్ తేజ్ చేసిన సినిమా ‘విరూపాక్ష’. ఇది తనకు రీ ఎంట్రీ మూవీ అనుకోవచ్చు. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లోని హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన ‘విరూపాక్ష’ నిజంగానే ఆడియెన్స్‌ను అలరించిందా?సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది?ఇవి అన్ని తెలుసుకోవాలి అంటే ముందు కథలోకి వెళ్ళాలి...
కథ: సినిమా కథ రుద్రవనం అనే గ్రామంలో మొదలవుతుంది,ఊర్లో కొందరు అనుమానాస్పదంగా చనిపోతూ ఉంటారు,ఊర్లో ఉన్న ఒక కుటుంబమే క్షుద్ర పూజలు చేస్తూ చంపేస్తున్నారు అనే కారణంగా అందరు కలిసి వెంకటాచలం మరియు అతని భార్యని కొట్టి చంపుతారు,ఇది జరిగిన కొన్నేళ్ల తరువాత సూర్య (సాయి ధరమ్ తేజ్) ఆ ఊర్లో అమ్మవారి జాతర కోసం ఊరికి తన తల్లితో కలిసి వస్తాడు...జాతర కారణంగా 15 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది,అయితే జాతర అయిపోయి వెళ్లిపోయే సమయంలో ఒక వ్యక్తి మరణిస్తాడు,అలాగే వరుసగా కొన్ని మరణాలు సంభవిస్తాయి,దాంతో ఊరి పూజారి (సాయిచంద్) ఊరికి అరిష్టమని చెప్పి, అరిష్టం పోవాలంటే ఊరిని అష్టదిగ్బంధనం చేయాలని చెప్తాడు...దాంతో సూర్య ఆ ఊరి నుండి వెళ్లి పోవాల్సి వస్తుంది... అసలు ఆ ఊరిని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తి ఏంటి?అందరు ఎలా చనిపోతున్నారు,సూర్య రుద్రవనం గ్రామాన్ని ఎలా కాపాడాడు?చివరికి ఏం జరిగింది తెలియాలి అంటే విరూపాక్ష సినిమా చూడాల్సిందే...
కథ ఎలా ఉంది అంటే: ఈ మధ్య సస్పెన్స్ థ్రిల్లర్స్ ట్రెండ్ కొనసాగుతోంది.ఈ జోనర్ సినిమాలు ఎక్కువగా విజయాలను సాధిస్తున్నాయి,అలాగే చేతబడి నేపథ్యంగా సాగే సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు...దర్శకుడు కార్తీక్ దండు. దీన్ని దృష్టిలో పెట్టుకునే విరూపాక్ష కథను సిద్ధం చేసుకున్నారు,మంచి కథ ఆసక్తికరమైన సన్నివేశాలు వీటికి తోడు నటీనటుల పెర్పామెన్స్‌తో పాటు మంచి సాంకేతిక అంశాలు కలిస్తే విజయం సాధించొచ్చు అనే నమ్మకం తో తీసాడు ఈ సినిమాని... క్రైమ్ సస్పెన్స్ సినిమాల్లో లవ్ ట్రాక్ ఉంటె అది ఆ సినిమాకి బలహీనతే అవుతుంది,ఆసక్తిగా సాగే సినిమాని కొంత డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది అని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో కమర్షియల్ సినిమాగా మారుస్తున్నారు... క్షుద్ర పూజల సీన్ తో మొదలయ్యే సినిమా ఆధ్యంతం ఇంటరెస్టింగ్ గా సాగుతుంది,ఎందుకు చనిపోతున్నారు,ఎలా చనిపోతున్నారు అనే మిస్టరీ ని మొదటి నుండి చివరి వరకు చూపిస్తూ కథని నడిపించాడు డైరెక్టర్...
నటి నటులు&సాంకేతిక వర్గం పని తీరు: హీరో గా సాయి ధరమ్ తేజ్ కి ఇది నిజంగా మంచి సినిమా అయినట్టే, కథలో భాగం అయ్యే క్యారెక్టర్ అని తప్ప హీరోయిజం చూపించే అంత పెద్ద పాత్ర కాదు అయినప్పటికీ ఒప్పుకొని ఈ సినిమా చేయడం గొప్ప విషయమే,అలాగే తనకి ఇచ్చిన పాత్ర వరకు న్యాయంగా చేసాడు,ఇక పోతే 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'సార్'తో సంయుక్తా మీనన్ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. 'విరూపాక్ష'లో చివరి వరకు కథ ఆమె పాత్ర మీద నడుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో నటిగా సంయుక్త నటన నెక్స్ట్ లెవల్.నటిగా ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్టే... పూజారిగా సాయి చంద్,ఊరి సర్పంచ్ గా రాజీవ్ కనకాల, సోనియా సింగ్, అజయ్, రవి కృష్ణ, సునీల్, యాంకర్ శ్యామల... ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు...
ఈ సినిమాకి మరొక ప్రధాన బలం కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం,కథకి తగ్గట్టు చక్కటి సంగీతాన్ని అందించారు,అలాగే ఎప్పటిలాగే ఇలాంటి సినిమాలకి బలం ష్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ...నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ బాగుంది...ఇక పోతే సుకుమార్ గారి స్క్రీన్ ప్లే చాలా ప్లస్ అని చెప్పొచ్చు,గురువు కి తగ్గ శిష్యుడి లా సుకుమార్ శిష్యుడు దండు కార్తీక్ చక్కటి సినిమాని ప్రేక్షకులకి అందించాడు...
చివరగా చెప్పేది ఏంటి అంటే : మరొక మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్...క్షుద్ర పూజలు,హత్యలు,హారర్ లాంటివి ఉండడం వాళ్ళ ఫామిలీ ఆడియన్స్ వస్తారో లేదో తెలీదు కానీ తప్పకుండ థియేటర్ కి వెళ్లి ఆ థ్రిల్ ని ఎంజాయ్ చేయదగ్గ సినిమా...ఇంటర్వెల్ ముందు సీన్ మరియు క్లైమాక్స్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే... రేటింగ్ : 4.0/5.0